రాత్రి కర్ఫ్యూ ను పొడిగించిన తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మే 8 ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం కేసుల సంఖ్య మరింత పెరిగినందున మరికొన్ని రోజులు కర్ఫ్యూ కొనసాగించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. హోంమంత్రి మహమూద్ అలీ సైతం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి రాష్ట్రంలోని పరిస్థితులు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‍కుమార్ కర్ఫ్యూ పొడిగింపు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదేశాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్సీలను సీఎస్ ఆదేశించారు. కరోనా ఉద్ధ•తి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20వ తేదీ రాత్రి నుంచి 30వ తేదీ ఉదయం (నేటి వరకు) కర్ఫూ విధించిన విషయం తెలిసిందే. కర్ఫ్యూ నేటితో ముగియనుండటంతో ప్రభుత్వం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.