యూఎస్ఏ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ కు .. ఘన సత్కారం
హైదరాబాద్‌లో యూఎస్ఏ కాన్సులేట్ జనరల్‌గా నియమితులైన జెన్నిఫర్ లార్సన్‌కు అమెరికా వాషింగ్టన్ డిసీలో ఘనంగా సత్కరించారు. అమెరికాలో ఇరవై ఐదు సంవత్సరాలుగా పలు సాంఫీుక సేవల్లో ముందుండే సాఫ్ట్ వేర్ వ్యాపార దిగ్గజం రవి పులి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ రవి కోట, మంత్రి (ఆర్థిక), భారత రాయబార కార్యాలయం ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్‌లోని యూఎస్ఏ కొత్త కాన్సుల్ జనరల్‌గా నియమితులైన లార్సన్ను డాక్టర్ రవి కోట ప్రశంసించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాల కాన్సులర్ అధికార పరిధిలో యూఎస్ఏ, అమెరికా మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయాలని రవి కోట సూచించారు. ఈ సందర్భంగా రవి పులికి డా.కోట ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.













