కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కొత్త ట్విస్ట్.. వందల కోట్లలో ముడుపులు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం రోజుకో కొత్త ట్విస్ట్ తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉంది అని అధికారులు ప్రకటించి ఆమెను అదుపులోకి కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 100 కోట్ల రూపాయల వరకు ముడుపుల రూపంలో కవితకు ముట్టినట్లు సమాచారం. అందుకే కవితను అరెస్టు చేసి కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారణ జరుగుతున్నట్లు ఈడి అధికారులు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు హైదరాబాద్, చెన్నై ,ముంబై.. ఇలా సుమారు 245 చోట్లలో సోదాలు జరిపారు.మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ లాంటి ఆప్ నేతలతో కవితకు కాంటాక్ట్ ఉన్నట్టు ఈడి అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విచారణ కోసం మార్చి 23 వరకు కవిత వారి కస్టడీలోనే ఉంటుందట. కవితతో పాటు ఢిల్లీలో బడాబడా నేతల పేర్లు కూడా ఈ స్కామ్ లో ఉన్నట్లు సమాచారం.