జలవిహార్ వాటర్ పార్క్ సరికొత్త ఆఫర్

ప్రజలంతా కరోనా టీకాలు వేసుకునేలా ప్రోత్సహించడంతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా జలవిహార్ వాటర్ పార్క్ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. వ్యాక్సిన్ వేసుకున్నవారికి పార్క్ ఎంట్రీ టికెట్లపై రూపాయలు 50/- డిస్కౌంట్ అందిస్తోంది. 18ఏళ్ల పైబడి వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. టికెట్ బుక్ చేసుకున్న సమయానికి రెండు డోసులు లేదా కనీసం ఒక్క డోసు తీసుకున్న వారు ఈ డిస్కౌంట్ పొందొచ్చు. టీకా తీసుకొన్న వారికి బేస్ ధరపై రూపాయలు 50/- తగ్గించి ఇస్తున్నాం అని జలవిహార్ వాటర్ పార్క్ తెలిపింది. అయితే, ఈ ఆఫర్ ను వినియోగించుకోవాలనుకునే వారు తమ వెంట కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసిన టీకా ధ్రువీకరణ పత్రాన్ని తీసుకురావాల్సి ఉంటుందని పేర్కొంది. జలవిహార్ వాటర్ పార్క్ టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద ఈ ధ్రువీకరణ పత్రాలను చూపించాలని, లేదా ఆరోగ్య సేతు యాప్ లో వ్యాక్సినేషన్ స్టేటస్ ను కూడా చూపించొచ్చని ‘జలవిహార్ వాటర్ పార్క్’ వెల్లడించింది. జలవిహార్ వాటర్ పార్క్ ఎంట్రీ టికెట్లపై ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.
ఈ సందర్భంగా జలవిహార్ వాటర్ పార్క్ చీఫ్ జనరల్ మేనేజర్ ప్రతాప్ మాట్లాడుతూ. ‘‘సౌత్ ఇండియా లోనే అతి తకువ ధరకు మంచి వినోదాని పంచె సంస్థగా పేరు గాంచిన జలవిహార్, జాతీయ టీకా పంపిణీ విధానానికి మా వంతు సహకారం అందించడం మా బాధ్యతగా భావిస్తున్నాం. మనందరి లక్ష్యాన్ని చేరుకునేందుకుగానూ ప్రజలంతా టీకా వేసుకునేలా ప్రోత్సహించాలని అనుకున్నాం” అని తెలిపారు.
Pratap K
Chief General Manager
Jalavihar Water Park
Necklace Road, Hyderabad
Phone +91 99088 22688