హైదరాబాద్ వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు
హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. నేటి నుంచి మూడు రోజుల పాటు(19-21) వరకు ప్రపంచ సమాచార సాంకేతిక పరిజ్ఞాన సదస్సు, నాస్కామ్ ఇండియా లీడర్షిప్ ఫోరమ్ (డబ్ల్యుసిఐటి-ఎన్ఐఎల్ఎఫ్) సమావేశాలు హైదరాబాద్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ (నోవాటెల్ హాటల్)లో జరుగనున్నాయి. ఇప్పటికే జిఇఎస్ను ఎంతో విజయవంతంగా నిర్వహించిన ఘనత సంపాదించకున్న తెలంగాణ ప్రభుత్వం ఐటీ మంత్రి కేటీఆర్ సారథ్యంలో ఈ సదస్సుకు ఆతిథ్యం వహిస్తోంది. శ్రీలంక ప్రధానితోపాటు కెనడా, అమెరికా, మెక్సికో, బ్రెజిల్, నైజీరియా, దక్షిణాఫ్రికా,తైవాన్, ఆర్మీనియా నుంచి 500 మంది వరకు ప్రతినిధులు వస్తున్న ఈ సద్సును ప్రధాని నరేంద్రమోదీ వీడియా కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించి ప్రారంభోపన్యాసం చేస్తారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు.













