ఈ నెల 28న హైదరాబాద్ కు ప్రధాని మోదీ
ఈ నెల 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ రానున్నారు. పరేడ్ గ్రౌండ్లో జరుగనున్న బీజేపీ యువ మోర్చా జాతీయ సమ్మేళనం ముగింపు సభలో ఆయన పాల్గొనున్నారు. తెలంగాణ యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. బీజేవైఎం నేషనల్ కాన్ఫరెన్స్లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 12 మందికిపైగా కేంద్రమంత్రులు రావడం ఖరారైపోయింది. ఈనెల 26, 27, 28 తేదీల్లో కొనసాగే ఈ సమ్మేళనంలో 50 వేల మంది యువ మోర్చా కార్యకర్తలు భాగం కానున్నారని రాష్ట్ర మోర్చా నాయకులు తెలిపారు. ముగింపు రోజున (28) లక్ష మంది కార్యకర్తలు సభకు హాజరు కానున్నారని బీజేవైఎం నాయకులు తెలిపారు.













