కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు

కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ శ్రీగణేశ్‌ను ప్రకటించారు. ఈ మేరకు ఏఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. లాస్యనందిత మృతితో ఈ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ లోక్‌సభ ఎన్నికలతో పాటు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. గతంలో ఈ స్థానంలో కాంగ్రెస్ తరపున గద్దర్ కుమార్తె వెన్నెల పోటీ చేసి లాస్యనందిత చేతిలో పరాజయం పాలయ్యారు.