హెరిటేజ్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు : బ్రాహ్మణి
పాలు, పాల ఉత్పత్తుల తయారీలో హెరిటేజ్ సంస్థకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి తెలిపారు. ఉప్పల్ పారిశ్రామికవాడలోని హెరిటేజ్ సంస్థ ఆవరణలో జరిగిన రజతోత్సవాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లోని పాడి రైతుల సంక్షేమానికి తమ సంస్థ పెద్దపీట వేస్తోందని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం నారా లోకేష్ ప్రత్యేకంగా రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేశారని అన్నారు. ఆ నిధి ద్వారానే పాడి రైతులకు గేదెల దానాను, పాలు పితికే యంత్రాలను సబ్సిడీపై ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన ఉద్యోగులకు, రైతులకు డిస్ట్రిబ్యూటర్లకు ఆమె అవార్డులను అందజేశారు.













