జీవితంలో గెలుపు ఓటములు సహజం : భువనేశ్వరి
జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అధైర్యపడకుండా ముందుకుసాగాలని విద్యార్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి సూచించారు. జీవితంలో గెలుపోటములు సహజమని, ధైర్యంగా నిలబడి పోరాడాలని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మెయినాబాద్‌లోని ఎన్టీఆర్ జూనియర్, డిగ్రీ మహిళా కళాశాల ప్రాంగణంలో సీఎల్ఏటీ-2019లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన ఆ కళాశాల విద్యార్థినులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిష్టాత్మక సీఎల్ఏటీ, ఏఐఎల్ఈటీ, లాసెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో తమ విద్యార్థినులు సాధించిన ఫలితాలు ఎన్టీఆర్ విద్యా సంస్థల ప్రతిష్టను పెంచాయని చెప్పారు. సీఎల్ఏటీలో జాతీయస్థాయి 3, 11 ర్యాంకులు సాధించిన సరగుల దేదీప్య, ప్రతీణ్ రాథోడ్‌తో పాటు పలువురు లాసెట్ ర్యాంకర్లకు సర్టిపికెట్లు అందజేశారు.













