ఎన్టీఆర్ కు ఘన నివాళి
మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ఘాట్ వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్ ఆదివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్ తనయులు హరికృష్ణ, రామకృష్న కుటుంబ సభ్యులతో చేరుకుని ఆయన సమాధాని దర్శించుకున్నారు. దగ్గుబాటి పురందేశ్వరి, వెంకటేశ్వర్రావు దంపతులు కుటుంబ సభ్యులతో వచ్చి ఘాట్‌ను దర్శించుకుని నివాళి అర్పించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి, ఎన్టీఆర్ కుమార్తె నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ తదితరులు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేవాన్ష్‌కు టీడీపీ నేత పార్టీ కండువాను మెడపై వేశారు. తర్వాత లక్ష్మీపార్వతి తన అనుచరులతో ఘాట్‌కు చేరుకుని సమాధిపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు.













