ఎంపీ కవితకు అరుదైన గౌరవం
మహిళలు, యువత సాధికారత కోసం కృషి చేసినందుకు గాను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత నారీ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ, జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల సంఘం సంయుక్తంగా కవితను ఈ పురస్కారానికి ఎంపిక చేశాయి. సంఘం అధ్యక్షురాలు వసంతలక్ష్మి ఎంఎస్ఎంఈ తరపున కవితకు పురస్కారం, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఢిల్లీలో ఈ రెండువారాల క్రితం జరిగిన పురస్కార ప్రదాన కార్యక్రమానికి కవిత హాజరు కాలేదు. దీంతో కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రి కల్రాజ్మిశ్రా ఆదేశాల మేరకు వసంతలక్ష్మి వచ్చి ఈ పురస్కారాన్ని కవితకు బహుకరించారు. తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా మహిళల అభ్యున్నతి, సాధికారతకు కవిత విశేష కృషి చేస్తున్నారని చెప్పారు.













