తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసిని
తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా దివంగ హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసినిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. నందమూరి సుహాసిని 2014 ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన షకీలా రెడ్డిని నియమించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా సుధాకర్ నాయుడు, రాష్ట్ర కార్యదర్శిగా బి. విఠల్, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా కరాటే రమేశ్‌ను నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.













