సుహాసినిని భారీ మెజార్టీతో గెలిపించాలి : బాలకృష్ణ
కూకట్పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసినిని భారీ మెజార్టీతో గెలిపించాలని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. నందమూరి కుటుంబీకులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్ద సుహాసిని, బాలకృష్ణ నివాళులు అర్పించారు. అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రైతులు, మహిళలకు ఎన్టీఆర్ అండగా ఉన్నారని పేర్కొన్నారు. మా ఆశయాలను సుహాసిని ముందుకు తీసుకెళ్తారన్నారు. తెలుగుదేశం పార్టీపై చూపిస్తున్న అభిమానాన్నే సుహాసినిపై కూడా చూపాలని అన్నారు. యువత, అభిమానులు, కార్యకర్తలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. సుహాసినికి ఆఖండ విజయాన్ని అందించాలని, ఇదే నందమూరి హరికృష్ణకు మనం ఇచ్చే నివాళి అని అన్నారు. తెలంగాణలో ప్రజా కూటమి విజయం సాధిస్తుందన్నారు.













