సీఎం కేసీఆర్ నిర్ణయం.. దేశానికే ఆదర్శం
దళిత, వెనుకబడిన వర్గాల సమానత్వం కోసం పోరాడిన మహానీయుడి పేరును సచివాలయానికి పెట్టడం ద్వారా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఎంపీ నామా నాగేశ్వర్రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం యావత్ జాతికి గర్వకారణమని అన్నారు. సీఎం నిర్ణయం చారిత్రాత్మమకన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో దళిత, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం మరింత పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్ను స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ పై ఉన్న గౌరవాన్ని సీఎం కేసీఆర్ మరోసారి సగర్వంగా చాటుకున్నారన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశానికి ఆదర్శమన్నారు. పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెడితే భారతదేశం ప్రతిష్ఠ, గౌరవం ప్రపంచవ్యాప్తంగా మరింత పెరుగుతుందని తెలిపారు.













