మునుగోడుకు బదులు… ముందస్తుకు వెళ్లొచ్చు
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆమోదించుకున్నప్పటికీ టీఆర్ఎస్లో కదలిక లేదని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, జాతీయ కారవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారపక్షం తీరు చూస్తుంటే మునుగోడుకు ఉప ఎన్నిక రాకపోవచ్చని, సీఎం కేసీఆర్ ముందుస్తు ఎన్నికలు వెళ్లే ఛాన్సు ఉందని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో నేను పోటీచేసినప్పుడు మునుగోడు సెగ్మెంట్లో బీజేపీకి 30 వేల ఓట్లు వచ్చాయి. పదేళ్లుగా రాజగోపాల్‌రెడ్డి అక్కడ గట్టి పట్టుంది. 2018 ఎన్నికల్లో ఏకంగా 88 స్థానాల్లో గెలిచిన టీఆర్ఎస్ మునుగోడులో ఓడిపోవడానికి కారణం ఆయన ప్రత్యర్థిగా ఉండటమే. అప్పుడే గెలవని టీఆర్ఎస్ ఇప్పుడెలా గెలుస్తుంది. విజయం సాధించబోయే రాజగోపాల్‌రెడ్డినే. రాహుల్‌గాంధీ వచ్చి ప్రచారం చేసిన కాంగ్రెస్‌కు ఓటమి తప్పదు. టీడీపీతో పొత్తుండదు. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది అని స్పష్టం చేశారు.













