Ramachandra Rao:నల్గొండను స్మార్ట్ సీటీగా అభివృద్ధి చేస్తాం : రామచంద్రరావు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌కి ఓటేసినా బీఆర్ఎస్ కు వేసినా ఒక్కటేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు (Ramachandra Rao) ఎద్దేవా చేశారు. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ఎన్నికల విజయ సంకల్ప సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ ఒకరు దొంగ అయితే, మరొకరు దోపిడీ దొంగ అని ఆరోపించారు. బీఆర్ఎస్ (BRS) లో గెలిచిన ఎమ్మెల్యేలు (MLAs) ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. అదే బీజేపీ నేతలు ఓడినా, గెలిచినా ఒకే పార్టీలో ఉంటారని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్లిస్తోందని విమర్శించారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ జెండా ఎగరబోతోందని జోస్యం చెప్పారు. నల్గొండలో ఇప్పటికే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదన్నారు. బీజేపీని గెలిపిస్తే నల్గొండ (Nalgonda)ను స్మార్ సిటీగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆరఎస్ పార్టీలకు అవకాశాలు ఇచ్చారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞపి చేశారు. బీజేపీ అవకాశం ఇస్తే తెలంగాణను అవినీతి లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});













