మాజీ హోంమంత్రి నాయిని ఆరోగ్యం విషమం
తెలంగాణ రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి, కార్మికనేత నాయిని నరసింహారెడ్డి (86) ఆరోగ్యం శుక్రవారం రాత్రి విషమించింది. ఆయన హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని అపోలో దవాఖానలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. గత నెల 28న కరోనా బారినపడిన నాయిని, బంజారాహిల్స్‌లోని ఓ దవాఖానలో 16 రోజులపాటు చికిత్స పొందారు. వారం క్రితం నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో పరీక్షించిన వైద్యులు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకినట్టు గుర్తించారు. ఆక్సిజన్ పడిపోవడంతో మంగళవారం దవాఖానకు తరలించారు. అప్పటి నుంచి ఆయనకు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.













