నేటి నుంచి నాగోబా జాతర
ఆదివాసీ సంస్కృతికి ప్రతీకగా నిలిచే నాగోబా జాతర నేటి నుంచి ప్రారంభంకానున్నది. ఏటా పుష్యమాసంలో మొదలయ్యే ఈ జాతరకు రాష్ట్రంలో పాటు ఆంధప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. వారంపాటు జరిగే జాతరలో ఆదివాసీ సంప్రదాయం ప్రకారం నాగోబాకు ప్రత్యేక పూజలు చేస్తారు. నాగోబాకు మొస్రం వంశీయులే అర్చకులుగా వ్యవహరిస్తూ మహాపూజలు నిర్వహిస్తారు. నాలుగు రోజుల క్రితమే పవిత్ర గోదావరి జలాలతో కెస్లాపూర్‌కు చేరుకున్న మెస్రం వంశీయులు.. ఆలయ సమీపంలోని మర్రి చెట్ల కింద సేదతీరారు. మెస్రం వంశీయులు నాగోబాకు మహాపూజలు నిర్వహించిన అనంతరం జాతర ప్రారంభమవుతుంది. కొవిడ్-19 నేపథ్యంలో ఈసారి ప్రజాదర్బార్‌ను రద్దు చేశారు. కేవలం పూజలు మాత్రమే కొనసాగుతాయని మెస్రం వంశీయులు సృష్టం చేశారు.













