బీజేపీకి నాగం గుడ్ బై
మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పారు. నాగర్ కర్నూల్లోని తన అనుచరులతో సుదీర్ఘంగా సమావేశమైన అనంతరం ఆయన పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. గత కొంత కాలంగా బీజేపీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. 2013లో బీజేపీలో చేరిన ఆయన అప్పట్నుంచి తన సేవల్ని సరిగ్గా వినియోగించుకోవడం లేదని వ్యతిరేకతతో ఉన్నారు. దీంతో ఆయన పార్టీ మారునున్నారని గత కొంత కాలంగా ప్రాచారం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయాన్ని వెల్లడించడంతో ప్రచారానికి తెరదించారు. కాంగ్రెస్ పార్టీలో చేరితే బాగుంటుందని ఎక్కువ మంది కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, నాగం పార్టీలో చేరతారనే విషయాన్ని మాత్రం ఇంకా సృష్టం చేయలేదు.













