నాగంకు హైకోర్టులో ఊరట
కాంగ్రెస్ నేత నాగం జనార్థన్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు భద్రత పునరుద్ధరించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు చేసింది. ప్రభుత్వం తనకు గన్మెన్లను తొలగించడంపై నాగం హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం నాగంకు భద్రత ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు పంపింది. తదుపరి విచారణను ఈ నెల 9వ తేదికి వాయిదా వేసింది. తనకు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను ఉపసంహరించిందని, 1+1 భద్రతను పునరుద్ధరించేలా ఆదేశించాలని కోరూతూ కాంగ్రెస్ నేత నాగం జనార్దనరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అవినీతిపై తాను హైకోర్టులో పిల్ దాఖలు చేశానని నాగం తెలిపారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన అన్నారు.













