ఆ లూటీని ఆపే బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? : నాగం
అసెంబ్లీలో పెట్టాల్సిన కాగ్ రిపోర్టును ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కన పెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్ధన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అత్యంత భారీ కుంభకోణం జరిగిన ప్రాజెక్టు అని ఆరోపించారు. కాళేశ్వరం పేరుతో కొన్ని వేల కోట్ల లూటీ జరిగిందన్నారు. ఆ లూటీని ఆపే బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? అని ప్రశ్నించారు. 40 శాతం అవినీతి జరిగిందని కర్ణాటకలో బీజేపీని గద్దె దించారు. తెలంగాణలో 70`75 శాతం అవినీతి జరుగుతోంది. తాడోపేడో తేల్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు విజ్ఞప్తి చేస్తున్నా. అవినీతి సంగతి తేల్చకుండా ఎన్నికలకు వెళ్లడం కరెక్టు కాదు. ప్రాజెక్టులు, బస్సులు అన్నీ మేఘా కృష్ణారెడ్డికే అప్పగించారు. మేఘా కృష్ణారెడ్డి తెలంగాణకు క్యాన్సర్ కంటే ప్రమాదకారిగా మారారు. అన్ని రాజకీయ పార్టీలకు ఫండిరగ్ ఇచ్చి మేనేజ్ చేసే స్థాయికి వచ్చారు అని అన్నారు.













