మిషన్ భగీరథను సందర్శించిన నాగాలాండ్ ఐఏఎస్ లు
నాగాలాండ్ సివిల్ సర్వీసెస్ అధికారుల బృందం గజ్వేల్ జిల్లాలోని కోమటిబండలోని మిషన్ భగీరథ ప్లాంట్‌ను సందర్శించారు. డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఏడు రోజుల శిక్షణలో భాగంగా ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ ఆదేశాల మేరకు హరి ప్రీత్‌సింగ్ ఆధ్వర్యంలో నాగాలాండ్ అధికారుల బృందం ప్లాంట్‌ను సందర్శించారు. కాగా మిషన్ భగీరథ నీటి సరఫరా, నీటి స్వచ్ఛత, అమలు చేయు విధానం, ప్రభుత్వం లక్ష్యం గురించి చీఫ్ ఇంజినీర్ విజయ్ ప్రకాశ్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాజయ్య, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాగార్జున రావు వారికి వివరించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ పథకాన్ని బృంద సభ్యులు ఎంతగానో కొనియాడారు.













