మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల
నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్లు తక్షణమే ప్రారంభమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నెల 14 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని, 15న నామినేషన్ల పరిశీలిస్తామని తెలిపింది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17 వరకు గడువు ఉంటుందని వెల్లడిరచింది. చండూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. శని, ఆదివారం నామినేష్లన దాఖలుకు సెలవు ఉంటుంది. ఈనెల 14వ తేదీ వరకు జరగనున్న నామినేషన్ల స్వీకరణకు 30 మంది పోలీసులు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. చండూరు పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. నామినేషన్ వేసే అభ్యర్థుల వెంట అయిదుగురికి మాత్రమే రిటర్నింగ్ కార్యాలయంలోకి అనుమతి ఉంటుంది. ఇక నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్, 6న కౌంటింగ్ నిర్వహించనున్నారు.













