మునుగోడు రిటర్నింగ్ అధికారిపై సీఈసీ వేటు
మునుగోడు రిటర్నింగ్ అధికారి జగన్నాథరావుపై సీఈసీ వేటు వేసింది. మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌సింగ్‌కు మునుగోడు ఆర్వోగా బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల కమిషన్ గుర్తుల కేటాయింపు అవకతవకలపై ఆర్వో జగన్నాథరావుపై వేటు వేశారు. నిర్ణయాన్ని ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో ఆర్వో వివరణ తీసుకొని నివేదిక పంపాలని సీఈవోకు ఆదేశాలిచ్చింది. మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్రులకు గుర్తుల కేటాయింపుల గందరగోళంపై ఫిర్యాదులు రావడంతో ఎన్నికల కమిషన్ స్పందించింది. రోడ్డు రోలర్ గుర్తును మొదట పొందిన అభ్యర్థికి తిరిగి కేటాయించాలని మౌఖికంగా ఆదేశించినట్లు తెలిసింది. చంచల్‌గూడలో బ్యాలెట్ ప్రింటింగ్‌కు నల్గొండ జిల్లా అధికారులు వెళ్లగా ఆ కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని, రోడ్డు రోలర్ గుర్తును జత చేసి కొత్తగా ప్రింట్ చేయాలని ఆదేశించినట్లు సమాచారం.













