ఏఐసీసీ నోటీసుపై .. ఎంపీ కోమటిరెడ్డి సమాధానం
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఇచ్చిన షోకాజ్ నోటీసుకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం ఇచ్చారు. పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి బీజేపీకి ఓటు వేయాలని మునుగోడు కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేసి చెప్పడంపై ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ గత నెల 22న కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చింది. 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై ఈ నెల 1న సీల్డ్ కవర్లో ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీకి సమాదానం ఇచ్చినట్లు కోమరెడ్డి వివరించారు. ఆది ఫేక్ ఆడియో. ఆ వాయిస్ నాది కాదు. మార్పింగ్ చేసింది. పార్టీలో నేను చాలా సీనియర్ నేతను. ఎన్ఎస్యూఐ విద్యార్థి విభాగం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. గడిచిన 35 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పని చేస్తున్నాను. నా సీనియార్టీకి పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని కోమటిరెడ్డి సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.













