24 గంటలు ఇస్తున్నట్లు నిరూపిస్తే … ఎంపీ పదవికి రాజీనామా
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పేరుకే 24 గంటల విద్యుత్ ఇస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గంట కూడా సక్రమంగా ఇవ్వడం లేదని విమర్శించారు. నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఏ సబ్స్టేషన్ వద్దకైనా వెళ్దామని, నిరంతరాయంగా విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపించాలన్నారు. మిగులు బడ్జెడ్తో ఏర్పాటైన రాష్ట్రంలో ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు ఇచ్చే పరిస్థతి లేదని ఆరోపించారు. మూడు గంటలు కావాలా? లేక మూడు పంటల కావాలా? అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. కావాలని సత్యగ్రహ దీక్షను భగ్నం చేయడానికి బీఆర్ఎస్ చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. కాంగ్రెస్ బలపడుతోందనే భయంతోనే లేని విషయాన్ని ఉన్నట్లుగా సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.













