ఎమ్మెల్యేలు కాకముందు ఎంత.. అయ్యాక ఎంత : కోమటిరెడ్డి
50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో సీఎం కేసీఆర్కు తెలియదా? అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. సూర్యాపేట సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో పాటు, బీఆర్ఎస్ మొదటి విడత అభ్యర్థుల జాబితాపై వెంకటరెడ్డి స్పందించారు. కేసీఆర్ రాజకీయ జీవితం మొదలైంది కాంగ్రెస్ పార్టీ నుంచేనని అన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మించింది కాంగ్రెస్ హయాంలోనే అని కేసీఆర్కు తెలియదా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల ఆస్తులు, ఎమ్మెల్యేలు కాకముందు ఎంత, అయ్యాక ఎంత పెరిగిందనే వివరాలు సేకరించి సోషల్ మీడియాలో షేర్ చేయాలని కార్యకర్తలు, ఉద్యమకారులు, నిరుద్యోగులకు పిలుపునిచ్చారు.













