ఈ విషయాలపై దిగ్విజయ్ విచారణ చేయాలి : కోమటిరెడ్డి
తెలంగాణ కాంగ్రెస్లో తలెత్తిన సంక్షోభంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాజా పరిణామాల నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి దిగ్విజయ్ సింగ్ను అధిష్ఠానం నియమించడం హర్షణీయమన్నారు. కాంగ్రెస్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కమిటీ నియామకాల్లో సీనియర్లకు అన్యాయం జరిగిందన్నారు. గాంధీభవన్లో ఉంటూ పైరవీలు చేసే వారికే కమిటీల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ఈ విషయాలపై దిగ్విజయ్ విచారణ చేయాలి. తెలంగాణలో పరిస్థితులు ఆయనకు తెలుసు. మా సమస్యలు పరిష్కారిస్తారనే నమ్మకం ఉంది. హుజూరాబాద్ ఎన్నికల్లో రేవంత్ ఎందుకు ప్రచారానికి వెళ్లలోదే విచారణ చేయాలి. మార్ఫింగ్ వీడియోలపై విచారణ చేయాలి. మునుగోడులో నన్ను బూతులు తిడుతున్న వాటిపై విచారించాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేవన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, ఆరోగ్య శ్రీ పని చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.













