వైభవంగా పీవీ శత జయంతి ఉత్సవాలు

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఎంపీ, పీవీ నరసింహారావు శత జయంతి వేడుకల కమిటీ చైర్మన్ కె కేశవరావు తెలిపారు. సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్సవ కమిటీ సభ్యులుగా ఉన్న శాసనమండలి సభ్యురాలు వాణిదేవి, చంద్రశేఖర్, రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్‍ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణలతో కలిసి నెక్లెస్ రోడ్డును ఆయన సందర్శించారు. ఈ నెల 28న పీవీ నరసింహారావు శత జయంతి పురస్కరించుకుని నెక్లెస్‍రోడ్డులోని పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయటకు అనువైన వివిధ స్థలాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు ముగింపు వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు. నెక్లెస్ రోడ్డును పీవీ నరసింహారావు మార్గ్గా మార్చుతున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.