ప్రధాని మోదీని కలిసిన ఎంపీ కవిత
ప్రధాని నరేంద్ర మోదీని నిజమాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు కలిశారు. పసుపు రైతుల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం మద్ధతు తెలిపిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల లేఖలు సైతం కవిత అందజేశారు. 10 నెలల పాటు సాగు చేసే పసుపు పంటలో రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని మోదీకి వివరించారు. విత్తనాల దగ్గర నుంచి దిగ్గుబడి, మద్ధతు ధర వరకు వారికి ఏ సహాయం లేదని తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే తప్ప ప్రీ- హార్వెస్టింగ్, పోస్ట్ హార్వెస్టింగ్ సహాయం అందేలా లేదని సృష్టం చేశారు. సాగు, ప్రాసెసింగ్, మద్ధతు ధర విషయాల్లో పసుపు బోర్డు ఉంటే రైతులకు మేలు జరుగుతుందని, పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేసినా తమకు అభ్యంతరం లేదని కవిత మోదీని కోరారు.













