ఎంపీ కేశవరావు కీలక నిర్ణయం.. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి
టీఆర్ఎస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు కేకే తన లేఖలో పేర్కొన్నారు. తాను ఈ సభ్యత్వాన్ని వదిలేస్తున్నట్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌కు ముందే తెలిపినట్లు కేకే పేర్కొన్నారు. అయితే మీడియాపై, వాక్ స్వాతంత్య్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపడమే కేకే రాజీనామాకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. కేకే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా ఉన్న సమయంలో పెయిడ్ న్యూస్‌పై ముఖ్యమైన అధ్యయనం చేసిన నివేదిక సమర్పించారు.













