వారికి పాస్‌పోర్ట్‌లు ఇవ్వడం దేశద్రోహమే
రోహింగ్యాలకు పాస్‌పోర్ట్‌లు ఇవ్వడం సిగ్గుచేటని బీజేపీ ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో దొంగ పాస్‌పోర్టుల వ్వవహారం హిందువులను కలవరపెడుతోందన్నారు. రోహింగ్యాల పాస్‌పోర్టుల వ్యవహారంలో సీపీ కార్తికేయ నైతిన బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హిందువులను ఇబ్బంది పెట్టడానికి సీపీ కార్తికేయ ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారని, ఆయన సూచనల మేరకే హిందువులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. పోలీస్ కమిషనర్ కార్తికేయ టీఆర్ఎస్-ఎంఐఎం ఏజెంట్ అని, ఆయన ప్రోద్భలంతోనే రోహింగ్యాలకు దొంగ పాస్‌పోర్టులు ఇచ్చారని పేర్కొన్నారు.
రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వడం చేతకాని ప్రభుత్వం రోహింగ్యాలకు దొంగ పాస్‌పోర్టులు మాత్రం ఇస్తోంది. ఈ ప్రభుత్వం ఎంఐఎంకు అమ్ముడుపోయింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జారీ అయిన ఆధార్ కార్డులపై విచారణ చేయాలని సీఎస్ సోమేవ్ కుమార్‌ను డిమండ్ చేస్తున్నాం. రోహింగ్యాలకు పాస్‌పోర్టులు ఇవ్వడం దేశ ద్రోహం. కేసీఆర్ కుటుంబం హిందువులను అణగదొక్కుతోంది. కేసీఆర్ రాజకీయ జీవితాన్ని టీఆర్ఎస్ను బొంద పెట్టేవరకు బీజేపీ నిద్రపోదు. పోలీస్ కమిషనర్ తీరుపై అమిత్ షాకు ఫిర్యాదు చేయనున్నాం. పోలీస్ కమిషనర్‌గా పని చేయడానికి కార్తికేయ అన్‌ఫిట్. ఆయన రాజీనామా చేసి వెళ్లిపోవాలి అని అర్వింద్ అన్నారు.













