బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తలపెట్టిన ప్రజాసంగ్రామ యాత్ర రెండోదశ త్వరలో మొదలు కానుంది. అలంపూర్ జోగులాంబ శక్తిపీఠం వేదికగా రెండో ప్రజా సంగ్రామ యాత్రను ఏప్రిల్ 14వ తేదీ నుంచి మొదలు పెట్టనున్నారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు చేరేవేసేందుకు గత ఏడాది ఆగస్టు 28న ప్రజాసంగ్రామ యాత్రను చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభించి. అక్టోబరు 2న హుస్నాబాద్‌లో బహిరంగ సభను నిర్వహించి ముగించారు. మొత్తం 438 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేశారు. మొత్తం 19 అసెంబ్లీ, ఆరు ప్లామెంటు నియోజకవర్గాలతో పాటు ఎనిమిది జిల్లాలను ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా 34 సభలు నిర్వహించారు.













