రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి : అర్వింద్
తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి చెందుతుందని బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు అంశంలో బీజేపీకి సంబంధం లేదని అన్నారు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను టీఆర్ఎస్ కావాలనే రాజకీయం చేస్తోందని తప్పుబట్టారు. మోదీకి కనపడకుండా తప్పించుకునేందుకు కేసీఆర్ మరోసారి కావాలనే ఢల్లీి వెళ్తున్నారని విమర్శించారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి జిల్లాను గాలికొదిలేశారని మండిపడ్డారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో పార్టీ పనులు వేగవంతం చేస్తామని అన్నారు. గడపగడపకు బీజేపీ నినాదంతో గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు.













