టీఆర్ఎస్ లోకి మోత్కుపల్లి నర్సింహులు : ముహూర్తం ఖరారు
మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ నెల 18న ఆయన పార్టీలో చేరబోతున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖరారైనట్లు తెలిపారు. తెలంగాణ భవన్ లో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచుకోనున్నారు. కేసీఆర్ చేతుల మీదగా గులాబీ కండువా కప్పుకోనున్నారు. తెలుగుదేశం పార్టీలో మోత్కుపల్లి సుదీర్ఘకాలం పనిచేశారు. టీడీపీ తరపున అప్పటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదేండ్లు ఎమ్మెల్యేగా బాద్యతలు నిర్వహించారు. అనంతరం టీడీపీ నుంచి బయటికి వచ్చిన మోత్కుపల్లి తాజాగా టీఆర్ఎస్ గుటికి చేరాలని నిర్ణయించుకున్నారు.













