మీరు జైల్లో ఉండి వస్తే.. అందరూ జైలుకు పోవాలా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బేగంపేటలోని తన నివాసంలో ఉపవాస దీక్ష చేపట్టారు. దసరా వేడుకలకు దూరంగా ఉంటూ మోత్కుపల్లి ఉపవాస దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ చంద్రబాబును అక్రమంగా నిర్బంధించి జైల్లో పెట్టారు. జైల్లో కిరాతకులుండాలి. ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసినవాళ్లు కాదు. జగన్ మీరు జైల్లో ఉండి వస్తే అందరూ జైలుకు పోవాలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టుతో తెలుగు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆయనను మానసిక క్షోభకు గురిచేస్తుంటే తల్లడిల్లిపోతున్నారు. చంద్రబాబుకు బెయిల్ రాకుండా కుట్ర చేస్తున్నారు. జగన్ రాజ్యంలో ఎవరైనా సుఖంగా ఉన్నారా? రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందన్నారు. జగన్ ఇక మీ ఆటలు సాగవు. మీ కుట్రలను ప్రజలు సాగనివ్వరు. మీ నాన్న పాలించినా ఇంత కుట్ర చేయలేదు. నేను కడుపుమండి మాట్లాడుతున్నాను. ప్రజలు జగన్ ఆటకట్టిస్తారు. డాక్టర్ సుధాకర్‌ను చంపిన పాపం జగన్‌దే. పేద ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఆయన దుర్మార్గంగా ఉపయోగించుకుంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.













