కాంగ్రెస్ పార్టీలోకి వలసలు.. చేరిన ప్రముఖులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద సంఖ్యలో నేతల వలసలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్, కపిలవాయి దిలీప్ కుమార్తో పాటు పటాన్ చెరువుకు చెందిన బీఆర్ఎస్ నేతల నీలం మధు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ ఖర్గే కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. మరోవైపు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టి. సంతోష్ కుమార్ గురువారం రాత్రి మాణిక్ రావు రావ్ ఠాక్రే సమయంలో కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.













