ఆయనకు ఏదైనా జరిగితే సీఎం జగన్ దే బాధ్యత
రాజమహేంద్రవరం జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏదైనా జరిగితే సీఎం జగన్‌దే బాధ్యతని మాజీ మంత్రి, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు మోత్కుపల్లి పురుగు మందు డబ్బా తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బతీసి చంపాలని చూస్తున్నారు. ఆయన్ను హింసించి భాదపెడుతున్నారు. జగన్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. రాజధాని లేని రాష్ట్రాన్ని పాలిస్తున్న ఏకైక సీఎం జగన్. చంద్రబాబు కుటుంబానికి భద్రత లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలు బతికే పరిస్థితి లేకుండా చేశారు. చంద్రబాబును బయటకు రాకుండా చేసి ఓట్లను సాధించాలని ప్రయత్నమా? ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి జగన్ మళ్లీ గెలవాలనిన చూస్తున్నారు అని మండిపడ్డారు.













