దళితబంధు చైర్మన్ గా మోత్కుపల్లి ?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినే దళిత బంధు పథకం చైర్మన్గా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును నియమించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొంతకాలంగా మోత్కుపల్లి నర్సింహులు ముఖ్యమంత్రికి అతి సన్నిహితంగా మెలుగుతుండడం కూడా ఇందుకు ఊతమిస్తోంది. ఇటీవల దళిత బంధు పథకంపై సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం పక్కనే మోత్కుపల్లి ఆసీసులయ్యారు. అప్పటి నుంచి మోత్కుపల్లికి రాజీకయంగా మంచి స్థానం కల్పించాలనే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో మోత్కుపల్లి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. పార్టీలో చేరిన అనంతరం దళిత బంధు చైర్మన్గా మోత్కుపల్లిని అధికారికంగా ముఖ్యమంత్రి ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ను నుంచి మోత్కుపల్లికి సృష్టమైన హామీ కూడా లభించినట్లు తెలుస్తోంది.













