హుస్సేన్ సాగర్ పై .. యూ ఆకార వంతెన
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరానికి ప్రధాన ఆకర్షణగా ఉన్న హుస్సేన్‌సాగర్ మీద ప్రభుత్వం ఏకంగా బ్రిడ్జిని నిర్మించనుంది. అయితే ఇది సాగర్‌లోకి వెళ్లేందుకు కాదని, పీవీఎన్ఆర్ మార్గ్‌గా పిలుస్తున్న నెక్లెస్ రోడ్డు మీద నిర్మించనున్న ఈ వంతెన యూ ఆకారంలో ఉండి కొంతవరకు సాగర్‌పైకి వెళ్లనుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ వెల్లడిరచారు. ఈ సంవత్సరాంతానికి ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. రష్యా రాజధాని మాస్కో పట్టణంలో ఉన్న ఒక వంతెనను ఈ బ్రిడ్జి పోలీ ఉంటుందని పేర్కొన్న ఆయన ఈ చిత్రాన్ని ట్వట్టర్లో పోస్టు చేశారు.













