టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కరీంనగర్ జిల్లా వీణవంకలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో జనసమీకరణ కోసం వీణవంకలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని జెండాలు మోసిన వారికే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలు ముందుగా అందుతాయని ప్రకటించారు. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే లబ్ధిదారులకు త్వరలో సీఎం కేసీఆర్ రూ.3 లక్షలు చొప్పున ఆర్థికసాయం ఇవ్వనున్నారని తెలిపారు. ఈ పథకంలో టీఆర్ఎస్ కార్యకర్తలకే ప్రాధాన్యం ఇస్తారని ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. లబ్దిదారుల ఎంపికలో గ్రామ సర్పంచి, పార్టీ అధ్యక్షుడు ఇచ్చే లిస్టే ఫైనల్ అవుతుందని స్పష్టం చేయడం సంచలనంగా మారింది.













