ఎమ్మెల్సీ పదవికి కొండా మురళీ రాజీనామా
ఎమ్మెల్సీ పదవికి కొండా మురళీ రాజీనామా చేశారు. ఈ మేరకు మండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను కొండా మురళి దంపతులు కలిసి రాజీనామా లేఖను అందజేశారు. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా మురళి ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ విషయంలో పార్టీని విభేదించి దంపతులిద్దరూ కాంగ్రెస్‌లో చేరారు. పరకాల నుంచి పోటీ చేసిన సురేఖ ఓటమి చవిచూశారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరినందుకు మురళీ ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆ పార్టీ ప్రతినిధులు మండలి చైర్మన్‌ను కోరారు. దీంతో మురళీ తనంతట తానుగా పదవికీ రాజీనామా చేశారు.













