ఆస్ట్రేలియాలో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం
భారత జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బోనాల ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కవిత ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్కు చేరుకున్నారు. ఆమెకు భారత జాగృతి ప్రతినిధులు, బీఆర్ఎస్ ఎన్నారైల ప్రతినిధులు స్వాగతం పలికారు. ఆమెకు పుష్పగుచ్చాలు అందించి, కండువాలు కప్పారు. భారత జాగృతి ఆస్ట్రేలియా అధ్యక్షుడు శ్రీకర్ రెడ్డి అండెం, విజయ్ కొరబోయిన, బీఆర్ఎస్ నాయకులు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా నలుమూలల నుంచే కాకుండా సిడ్నీ, మెల్బోర్న్ తదితర నగరాల నుంచి తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో స్వప్న దోమ, రాజేశ్ అర్సనపల్లి, బీటీఏ అధ్యక్షుడు కిశోర్, విరించి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.













