మాది పోరాటం చేసే కుటుంబం.. ఎవరికీ భయపడేది లేదు
ఢిల్లీ మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి చేసిన సహ్రస చండీయాగం, పూర్ణాహుతికి కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తనపై బీజేపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కుమార్తెను బద్నాం చేస్తే కేసీఆర్ వెనక్కి తగ్గుతారనుకుంటున్నారు. ఎంత ఒత్తిడి చేసినా కేసీఆర్ వెనక్కి తగ్గేదిలేదన్నారు. కేంద్రాన్ని విమర్శిస్తోన్న ఆయన్ను మానసికంగా కుంగదీయాలనే ప్రయత్నాలు తప్ప ఇవి మరొకటి కాదు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. ఎవరికీ భయపడేది లేదు. మాది పోరాటం చేసే కుటుంబం. ఏ దర్యాప్తుకైనా మేం సిద్ధమే అని అన్నారు.













