జీవో నంబర్ 3ని రద్దు చేయాలి

ఆడబిడ్డల ఉద్యోగాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆక్షేపించారు. భారత జాగృతి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో ఆమె దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం చేస్తున్న జీవో నంబర్ 3ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ధర్నా చేసే దౌర్భాగ్య స్థితికి ప్రభుత్వం తీసుకొచ్చిందని మండిపడ్డారు. సోనియా, ప్రియాంకా గాంధీలు పార్లమెంట్‌కు వెళ్లాలి. కానీ, తెలంగాణ బిడ్డలు వంటింట్లో కూర్చోవాలా? అని ప్రశ్నించారు.