రసమయి బాలకిషన్ పై ఎమ్మెల్సీ కవిత ప్రశంసలు
మానుకొండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశంసలు కురిపించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ రాంలీల మైదానంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిలా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానకొండూరు ఆడబిడ్డల ఆశీర్వాదంతో రాబోయే ఎన్నికల్లో రసమయి బాలకిషన్ 60 వేల ఓట్ల మెజారిటీతో మరోసారి గెలుస్తారని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం తన పాటతో అలుపెరుగని పోరాటం చేసిన ఘనత రసమయిది అని ప్రశంసించారు. గాయకుడు పాలకుడైతే అభివృద్ధి ఎలా ఉంటుందో మానుకొండూరు నియోజకవర్గాన్ని చూస్తే అర్థమవుతుంది అని పేర్కొన్నారు.













