తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో : ఎమ్మెల్సీ కవిత
వరిసాగులో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కామారెడ్డి సదాశివనగర్ మండలం పద్మాజివాడలో నిర్వహించిన రైతు దినోత్సవంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులకు మర్యాద తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. తెలంగాణ రాకముందు రైతుల ఆత్మహత్యలు ఉండేవి అని కవిత గుర్తు చేశారు. ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు లేవని స్పష్టం చేశారు. నకిలీ విత్తనాలు లేవు. నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నామని తెలిపారు. విత్తనాలు, ఎరువుల కొరత లేనే లేదు. కరెంట్ సమస్యలు కూడా లేవని స్పష్టం చేశారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకున్నామని పేర్కొన్నారు. దీంతో భూగర్భ జలాలు కూడా పెరిగాయన్నారు. కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. వరిసాగులో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు. రైతుల కోసం సంఘాలు పెట్టిన ఘనత కేసీఆర్‌దే అని స్పష్టం చేశారు. రైతులు లాభదాయకమైన పంటలవైపు దృష్టి పెట్టాలని ఎమ్మెల్సీ సూచించారు.













