ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు?.. ఈడీ రిపోర్టులో ఏముందంటే..?
మరోసారి తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ హాట్ టాపిక్‌గా మారింది. దీనిలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హస్తం ఉన్నట్లు మరోసారి వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంచలన కేసులో నిందితుడు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టు బయటకు వచ్చింది. ఈ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును కూడా ఈడీ అధికారులు ప్రస్తావించడం సంచలనానికి దారి తీసింది. మొత్తం 32 పేజీల ఈ రిమాండ్ రిపోర్టులో కవిత పేరు మూడు సార్లు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఈ సంచలన రిపోర్టు ప్రకారం మొత్తం రూ. 100 కోట్ల విలువైన ముడుపులను సౌత్ గ్రూప్ చెల్లిచింది. ఈ సౌత్ గ్రూప్‌లో కవిత, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుటుంబానికి చెందిన శరత్ రెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా కలిసి సౌత్ గ్రూప్ తరఫున రూ. 100 కోట్లను విజయ్ నాయర్‌కు చెల్లించినట్లు తెలుస్తోంది. విచారణ సందర్భంగా అమిత్ అరోనా తన వాంగ్మూలంలో ఈ విషయాలను ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీల కోసం కవిత ఉపయోగించిన మొత్తం 10 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేసినట్టు ఈ రిపోర్టులో సమాచారం ఉంది.













