టీఆర్ఎస్ ఆస్ట్రేలియా సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం విచ్చేసిన టీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిశానిర్దేశం చేశారు. మహానగరాన్ని మతోన్మాదుల నుండి కాపాడుకుని అభివృద్ధికి పట్టంకట్టే టీఆర్ఎస్ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచేలా ఇంటికి ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు ఎప్పటి కప్పుడు తిప్పి కొట్టాలని కవిత సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ గుండె లాంటిదని, దీన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళ చేతిలో పెట్టొద్దని ప్రజలకు వివరించి డిసెంబర్ ఒకటో తేదీన జరిగే ఎన్నికల్లో కార్తు గుర్తు తిరుగులేని విజయాన్ని అందుకునే దిశగా పని చేయాలని కోరారు.
ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకులు అభినయ్ కనపర్తి, ఆకాష్ రెడ్డి, నరేష్ జవ్వాజి, అయాన్ తదితరులు పాల్గొన్నారు. తమ సభ్యులకు దిశా నిర్దేశం చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.













