పదేళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నా.. మహిళా బిల్లును ఎందుకు ఆమోదించలేదు ?
పదేళ్లుగా పూర్తి మెజార్టీతో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం మహిళా బిల్లును ఎందుకు ఆమోదించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికీ పార్లమెంట్లో మహిళా సభ్యులు కేవలం 12 శాతమేనని తెలిపారు. తొలి లోక్సభలో 8 శాతం మహిళా ఎంపీలు ఉంటే ఇప్పుడు 12 శాతం మంది ఉన్నారన్నారు. మణిపుర్లో ఇప్పుడు ఇద్దరు మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మహిళలు సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగానే మిగిలిపోవాలా? అని ప్రశ్నించారు. 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా బిల్లు 2023 వచ్చినా ఎందుకు ఆమోదం పొందలేదు అని ప్రశ్నించారు.













